నేడు 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి
- రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి బ్లాక్‌బస్టర్ విజయం
- ఈ సాయంత్రం హైదరాబాద్‌లో మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్
- వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి
- శిల్పకళావేదికలో ఘనంగా ఏర్పాట్లు చేసిన చిత్రబృందం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో 'మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్' పేరుతో విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. 'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందునుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ ఈ వేడుకను ఘనంగా ప్లాన్ చేసింది.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేశారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ వేదికగా చిత్రబృందం తమ ఆనందాన్ని ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోనుంది.